అనంతపురం, 04 ఏప్రిల్ (హి.స.),):సీఎం చంద్రబాబు 6న అనంతపురం జిల్లాకు రానున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో ఆయన పర్యటన ఖరారయిందని సమాచారం.
సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఓ ఆనంద్, ఎస్పీ జగదీశ్, ఎమ్మెల్యే జేసీ అశ్మిత్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. 6న సీఎం అత్తిరాళ్లదిన్నె సమీపంలోని పెండేకల్ జలాశయం వద్దకు చేరుకుని, జలధార కార్యక్రమంలో భాగంగా జలహారతి ఇస్తారు. యాడికిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
