Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
721 ఏళ్ల తర్వాత.. భోజ్శాలలో మళ్లీ మహాహారతి

721 ఏళ్ల తర్వాత.. భోజ్శాలలో మళ్లీ మహాహారతి

భోజ్శాల, 22 మే (హి.స.)

మధ్యప్రదేశ్లోని భోజ్శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమయింది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్శాల ఆలయంలో మహాహారతి(Bhojshala Maha Aarti) నిర్వహించారు.

ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నాళ్లూ ముస్లింలు నమాజ్ చేశారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. భోజ్శాల సరస్వతీ దేవి ఆలయమని కోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం తెలిసిందే.భోజ్శాల ఆలయ పరిసరాల్లో సుమారు 1800 మంది బలగాలను మోహరించారు. మే 15వ తేదీన తీర్పు వచ్చిన తర్వాత అక్కడ తొలి శుక్రవారం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu