అమరావతి, 05 మే (హి.స.)
పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు నగర పంచాయితీ పరిధిలోని పెదపేటలో రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పెదపేటకు చెందిన వంగా జ్యోత్స్న మరో దీనిని దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం జరపడం సుప్రీం కోర్టు తీర్పుకి విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. హడావుడిగా రామాలయం నిర్మాణం జరుపుతున్నారని, అనుమతులు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్కుమార్... వ్యాజ్యాన్ని లంచ్ మోషన్గా స్వీకరించి విచారణ జరపాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ను అభ్యర్థించారు. మంగళవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
