Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసీ బస్సు ను నడిపిన రామగుండం ఎమ్మెల్యే..

ఆర్టీసీ బస్సు ను నడిపిన రామగుండం ఎమ్మెల్యే..

గోదావరిఖని, 19 మే (హి.స.)

ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు

కావాల్సిన సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యం అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు.

మంగళవారం అంతర్గాం మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలో ప్రజల సౌకర్యం కోసం టీజీఎస్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలను రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లోనూ కష్టపడి పనిచేస్తున్న కూలీలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. అనంతరం రైతు కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఈ బస్ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu