Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసుపత్రి నుంచి ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్.. మళ్లీ జైలుకు తరలింపు

ఆసుపత్రి నుంచి ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్.. మళ్లీ జైలుకు తరలింపు

ఇస్లామాబాద్, 21 ఆగస్టు (హి.స.)

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని తిరిగి రావల్పిండి (Rawalpindi)లోని అడియాలా జైలుకు చేరుకున్నారు.

గురువారం అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించిన అధికారులు, శుక్రవారం ఉదయానికి ఆయనను మళ్లీ జైలుకు తరలించా. అయితే, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఆయనకు నైపుణ్యం కలిగిన వైద్య చికిత్స అందించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వుల మేరకు అధికారులు అర్ధరాత్రి వేళ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర అనారోగ్యసమస్యలు..

ఇమ్రాన్ ఖాన్కు బీపీ తరచూ మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలతో పాటు కుడి కంటిచూపు బాగా తగ్గిపోతోందని ఆయన తరఫు న్యాయవాదులు, వైద్య నివేదికలు కోర్టుకు తెలిపాయి. ఆసుపత్రిలోని నిపుణులైన వైద్యులు ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, జైలులో ఉండేందుకు ఫిట్గా ఉన్నారని ధృవీకరించిన అనంతరం అధికారులు మళ్లీ జైలుకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu