Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఆత్మనిర్భర్ లో..ఏపి.ముఖ్య పాత్ర

మరావతి, 16 మే (హి.స.)అడ్వాన్డ్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు రావడం ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి మారనుందని చెప్పారు.

ఈ ప్రాజెక్టుతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో ఏపీ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. దీనిని రాష్ట్రానికి కేటాయించినందుకు రాజ్నాథ్సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. 'ఇది రూ.15వేల కోట్లకుపైగా పెట్టుబడితో, 7500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టు. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి మారుతుంది. అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి రక్షణ శాఖ, కేంద్రం సహకారం అందించాయి. జెట్ స్పీడ్తో అనుమతులిచ్చాం. 36 రోజుల్లోనే శంకుస్థాపన చేశాం. ఏరోస్పేస్ రంగంలో ఒ కీలక ప్రాజెక్టుతో పాటు మరికొన్ని డిఫెన్సు ప్రాజెక్టులు కూడా ఇక్కడకు వస్తాయి' అని తెలిపారు. కర్నూలు (ఓర్లకల్లు) డ్రోన్ సిటీలో శంకుస్థాపనలు చేయడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం యుద్ధాల్లో డ్రోన్లే కీలకంగా మారాయని గుర్తుచేశారు. శ్రీహరికోట అంతరిక్షశక్తి, నాగాయలంకలో క్షిపణి శక్తి, పుట్టపర్తిలో రక్షణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తితో ఏపీ దేశానికి అండగా నిలుస్తోందన్నారు.

'గతంలో రాయలసీమ రతనాల సీమ.. కానీ వివిధ కారణాలతో కరువుసీమగా మారిపోయింది.. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పరిస్థితిని మార్చాం' అని సీఎం తెలిపారు. రాయలసీమలో ప్రతి ఎకరానికీ నీరిచ్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. 'ఇక్కడి ఇనుపఖనిజం, సున్నపు రాయి తదితరసహజ వనరులను సమర్థంగా వినియోగించుకుంటాం. కడప స్టీల్ ప్లాంటు పనులను జూన్లో ప్రారంభిస్తాం. 2027 డిసెంబరునాటికి పూర్తి చేస్తాం. స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలకా్ట్రనిక్స్ తదితర పరిశ్రమలతో రతనాల సీమగా మారుస్తాం. తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్, శ్రీహరికోట సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తాం' అని చెప్పారు. 'గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎ్ఫ-జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలులో వస్తోంది. జేజీఎఫ్ లో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకంగా మారుతుంది' అని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu