Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఆటోబోల్తా...ఐదుగురికి గాయాలు...ఒకరి మృతి

ఎమ్మిగనూరు, 15 మే (హి.స.)

ర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం ముగతి వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో రంగడు(22) అనే యువకుడు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి రెండు వారాల క్రితమే వివాహమైంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో వెళ్తుండగా రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కలను తప్పించబోయి డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో ఆటో బోల్తా పడింది. మృతుడి స్వగ్రామం దేవనకొండ మండలం కప్పట్రాల్లగా తూలింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu