Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆయిల్ పామ్ సాగు ను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

ఆయిల్ పామ్ సాగు ను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి, 06 మే (హి.స.)

కామారెడ్డి జిల్లా తాడువాయి మండలంలోని ఏండ్రియల్ గ్రామ శివారులో రైతు బొక్క హన్మాండ్లు మూడున్నర ఎకరాలలో సాగు చేస్తున్నఆయిల్ ఫామ్ తోటను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు.

తోటలో మొక్కల పెరుగుదల, నిర్వహణ విధానాలు, సాగు పద్ధతులను పరిశీలించిన కలెక్టర్ పంట అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు బొక్క హన్మాండ్లు మాట్లాడుతూ, 2022 సంవత్సరంలో మూడున్నర ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటను ప్రారంభించినట్లు తెలిపారు. మూడున్నర ఎకరాలలో అయిల్ ఫామ్తో పాటు అంతర్ పంటలుగా కూరగాయలు, సోయా, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగు చేస్తూ ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఉద్యానవన శాఖ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా ఎకరానికి రూ.4,200 చొప్పున సబ్సిడీ అందించడంతో పాటు డ్రిప్ పరికరాలు కూడా మంజూరు చేసినట్లు రైతు వివరించారు. ప్రభుత్వ సహకారంతో సాగు ఖర్చులు తగ్గి, దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయిల్ ఫామ్ పంట ధర టన్నుకు సుమారు రూ.23,000 ఉండగా, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని రైతు ఆనందం వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా లాభదాయకమైన పంటగా ఆయిల్ ఫామ్ రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu