Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్

అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్

భోజ్శాల, 20 మే (హి.స.)

లండన్లోని మ్యూజియంలో ఉన్న పురాతన వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి భారత్కు తీసుకురావాలన్న డిమాండ్తో మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పలు హిందూ సంఘాలు కలిసి మంగళవారం ఈ పిటిషన్ను దాఖలు చేశాయి. తమకు కోహినూర్ వజ్రం కన్నా వాగ్దేవి విగ్రహమే అత్యంత ముఖ్యమైనదని, అది తమ విశ్వాసానికి సంబంధించిన విషయమని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణాన్ని వాగ్దేవి ఆలయంగా గుర్తిస్తూ మే 15న మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. లండన్లో ఉన్న అసలైన విగ్రహాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించవచ్చని ఆ తీర్పులో కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు తాజాగా హైకోర్టును ఆశ్రయించాయి.

పిటిషనర్లలో ఒకరైన కుల్దీప్ తివారీ మాట్లాడుతూ, కోహినూర్ వజ్రం తరహాలోనే ఇప్పుడు వాగ్దేవి విగ్రహం అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ మా విశ్వాసాలు, సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్నందున, కోహినూర్ కన్నా ఈ విగ్రహమే మాకు అత్యంత విలువైంది, అని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ (ఏఎస్ఐ), రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్తగా విజ్ఞప్తులు సమర్పించినట్లు ఆయన వివరించారు.

చారిత్రక ఆధారాల ప్రకారం, 1034లో పరమార వంశానికి చెందిన భోజరాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలో ఇది ధ్వంసమైందని చెబుతారు. మే 15న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత భక్తులు భోజ్శాల ప్రాంగణంలో వాగ్దేవి ప్రతిరూప విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu