Dailyhunt
ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్

ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్

హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర(ఆర్సీబీ) జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఆటగాడు నువాన్ తుషారా తన దేశ క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసు వేసినట్లు సమాచారం.

ఐపీఎల్ ఆడేందుకు తనకు నో ఆబ్జెక్షన్ సరిఫికేట్(ఎన్వోసీ) నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నువాన్ తుషారా ఈ నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలంకకు చెందిన మీడియా సంస్థ నివేదిక ప్రకారం..

నువాన్ తుషారా ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డును అనుమతి కోరగా.. బోర్డు నిర్దేశించిన ఫిట్నెస్ ప్రమాణాలను అందుకోలేదనే కారణంతో అతడికి ఎన్వోసీని నిరాకరించింది. అయితే తన కెరీర్ అంతటా ఫిట్నెస్ స్థాయిలు ఇలాగే ఉన్నాయని తెలిపాడు.

తుషారా తన ఫిర్యాదులో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, కార్యదర్శి బందుల దిస్సనాయకే, కోశాధికారి సుజీవ గొడాలియడ్డ, సీఈఓ ఆష్లే డి సిల్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. మరోవైపు శ్రీలంక క్రికెట్ బోర్డుతో తనకున్న సెంట్రల్ కాంట్రాక్టు మార్చి 31తో ముగిసిందని.. దానిని పునరుద్ధరించుకోవడానికి తనకు ఇష్టం లేదని నువాన్ తుషారా స్పష్టం చేశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu