
హైదరాబాద్, 02 సెప్టెంబర్ (హి.స.) సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీని వల్ల వాహనాలు సులభంగా వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్ప్రీత్సింగ్, ట్రాఫిక్ డీసీపీ సంక్రాంతి రవికుమార్, అదపు డీసీపీ జి.హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్ రెడ్డి పలు ప్రాంతాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం, యూటర్న్లు, జంక్షన్ల ఆప్టిమైజేషన్ ద్వారా ట్రాఫిక్ ఆలస్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేపీహెచ్బీ, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని జేఎన్టీయూ నుంచి సింక్రోనీ (రాయదుర్గం) మెట్రోస్టేషన్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రత్యేక క్యారేజ్వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

