Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక కొమురయ్య.. అడిషనల్ కలెక్టర్

అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక కొమురయ్య.. అడిషనల్ కలెక్టర్

ఆసిఫాబాద్, 04 జూలై (హి.స.) అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక దొడ్డి కొమురయ్య అని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో దాసరి వేణు తో కలిసి ఆయన పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూస్వాముల ఆగడాలు, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నదీమ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu