Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

అందుబాటులోకి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు

అమరావతి, 16 మే (హి.స.)

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా శనివారం తెలిపారు.

మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా, ఏపీ ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లపై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. విద్యార్థులందరూ పూర్తి ప్రిపరేషన్ తో పరీక్షలకు హాజరుకావాలని రంజిత్ బాషా కోరారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu