Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసంపూర్తిగా ఉన్న భవానాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

అసంపూర్తిగా ఉన్న భవానాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి

నారాయణపేట, 21 మే (హి.స.)

నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో విలువైన స్థలంలో

అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ భవనాన్ని మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.

గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ భవనాన్ని మహిళా డిగ్రీ కళాశాలగా మార్పు చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి డెవలప్మెంట్ నిధుల కింద టౌన్ హాల్గా నిర్మించడంతో దీనివల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న మక్తల్ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరున వృధాగా అసంపూర్తిగా ఉన్న భవనాన్ని టౌన్ హాల్ గా మార్పులు చేయాలని మంత్రి గురువారం అధికారులతో పరిశీలించారు.

పట్టణంలో ఉండే స్థలంలో మార్కెట్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి అసంపూర్తిగా ఉండటంతో ప్రస్తుతం అది బూతు బంగ్లాగా మారింది. అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న మక్తల్ పట్టణంలో ప్రైవేటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి టౌన్ హాల్ లేక ఇబ్బంది పడుతున్న నిరుపయోగంగా ఉన్న భవనాన్ని కమర్షియల్ పరంగా టౌన్ హాల్ మార్పు చేయడంతో సమావేశాలు శుభకార్యాలకు వాడుకోవడం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ క్రమంలో నిరుపయోగంగా సంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని టౌన్హల్గా మార్చేందుకు కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu