Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్.. నిందితుడు అరెస్ట్

బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్.. నిందితుడు అరెస్ట్

మిర్యాలగూడ, 18 మే (హి.స.)

బెట్టింగులకు బానిసై అప్పులు కావడంతో.. ఆ అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితున్ని మిర్యాలగూడా వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.

సోమవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (గిరి) బెట్టింగ్ లకు అలవాటు పడి అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చడం కోసం చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నాడు.

అందులో భాగంగా మిర్యాలగూడా పట్టణంలోని ఖలీల్ దాబా సమీపంలో వైష్ణవి హోమ్స్ వద్ద ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా యమహా ఎఫ్ జెడ్ బైక్ పై వచ్చి మహిళ మెడలోని మూడు తులాల బంగారపు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు.

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన వన్టౌన్ సీఐ నాగభూషణరావు సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్ద మరొక స్నాచింగ్ చేయడానికి రెక్కి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. కాగా ఇతను గతంలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రైల్వే స్టేషన్లో, నకిరేకల్ పట్టణంలో స్నాచింగ్లకు పాల్పడినట్టు డీఎస్పీ చెప్పారు. నిందితుడి నుండి 3 లక్షల విలువగల బంగారం, బైకు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu