Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీ వాహనాల చోరీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ పోలీసులు

భారీ వాహనాల చోరీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ పోలీసులు

ఆదిలాబాద్, 28 మే (హి.స.)

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ

వాణిజ్య వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా మావల పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

ఈ కేసులో మొత్తం పదిమంది పై కేసునమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. హర్యానాకు చెందిన సలీం, నఫీస్ ఖాన్, రాజస్థాన్కు చెందిన ఇంతాజ్ హుస్సేన్ అలియాస్ ఇంతియాజ్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. హైవేలు, పెట్రోల్ బంకుల వద్ద పార్క్ చేసిన ఐచర్, టిప్పర్ వంటి భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వాహనాల గ్లాస్ పగులగొట్టి, స్టీరింగ్ లాక్ విరగదీసి, ఇగ్నిషన్ వైరింగ్ కట్ చేసి ట్రక్కులను దొంగిలించేవారని చెప్పారు.

దొంగిలించిన వాహనాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తరలించి ఒక్క రోజులోనే విడిభాగాలుగా మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై మావల, గుడిహత్నూర్, శంషాబాద్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. కాగా, ఇటీవల మావల బైపాస్ వద్ద వాహన తనిఖీల సమయంలో టయోటా ఎటియోస్ కారులో వెళ్తున్న నిందితులను పోలీసులు అనుమానంతో ఆపగా, వారు పరారయ్యే ప్రయత్నం చేశారు. వెంటనే వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి టయోటా ఎటియోస్ కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పని చేసిన సైబర్ సెల్, సాంకేతిక బృందం, మావల, ఆదిలాబాద్ రూరల్ పోలీసులు, సీసీఎస్ సిబ్బంది, మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు ప్రేమ్ కుమార్, కె. ఫణీందర్, ఎస్సైలు విష్ణువర్ధన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu