Dailyhunt

భర్త నామినేషన్ లో హాజరయిన కుష్బూ

మధురై, 05 ఏప్రిల్ (హి.స.)

రాజకీయాలు వేరు, కుటుంబ బంధం వేరని బీజేపీ నాయకురాలు, నటి కుష్బూ నిరూపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త, ప్రముఖ నటుడు-దర్శకుడు సుందర్ సి అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేస్తున్నారు.

మధురై సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన నామినేషన్ దాఖలు చేయగా, పార్టీ విభేదాలను పక్కనపెట్టి కుష్బూ కూడా భర్త వెంట నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. భర్తకు మద్దతుగా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సుందర్ సి పుదియ నీతి కట్చి పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. పొత్తులో భాగంగా అన్నాడీఎంకేకు చెందిన 'రెండాకుల' గుర్తుపై ఆయన పోటీ చేయనున్నారు. సుందర్ సి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేత ఏ.సి. షణ్ముగంతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu