Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భువనగిరి పట్టణంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

భువనగిరి పట్టణంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

భువనగిరి, 20 మే (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లా

భువనగిరి పట్టణంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న హోటల్ దీప్తి సమీపంలో లారీ బైక్ ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు జమ్ముల లక్ష్మి కాంత్ (30) భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన వారు కాగా మరొకరు ప్రమోద్ సంగారెడ్డి వాసిగా గుర్తించారు. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న వీరి బైక్ అతివేగంతో ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన విచారణ చేస్తున్నట్టు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu