Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రిడ్జీ కమ్ బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వాకిటి

బ్రిడ్జీ కమ్ బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వాకిటి

నాగర్ కర్నూల్, 28 మే (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా మక్తల్

మండలంలోని చిట్యాల - గజరందొడ్డి

గ్రామాల మధ్య రూ.20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గురువారం పరిశీలించారు.

చిట్యాల దగ్గర ఉన్న పెద్ద వాగు వర్షాకాలంలో ఉదృతంగా పారే వరద వల్ల దాదాపు 10 గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి చేరుకోవడానికి ఇబ్బందై రాకపోకలు నిలిచిపోవడం జరుగు తుందని కాలంలో ఉదృతంగా పారుతున్న వాగులో అత్యవసర వైద్య సేవలు పాఠశాలకు రావాల్సిన విద్యార్థులు ఇతర పనులకు వెళ్లాల్సి న ప్రజల కార్యకలాపాలు నిలిచిపోతాయని చిట్యాల-గజరందొడ్డి గ్రామాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మించాలని ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు.

ఇచ్చిన హమీ ప్రకారం.. వంతెనతో పాటు రోడ్డు కమ్ బ్యారేజీ నిర్మాణం చేయడం వల్ల వాగులో నీటి స్టోరేజ్ వేసవికాలంలో కూడా రైతులకు మేలు జరుగుతుందని ఈ బ్యారేజ్ లో నీళ్ళు నిలిచి పోవడం వల్ల చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పెరిగి దాదాపు వందలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందని గుర్తించారు. ముందు జాగ్రత్తగా రూ.20 కోట్లతో రోడ్డు కం బ్యారేజీ నిర్మాణం చేపట్టి కష్టాలు తీరడంతో పాటు రెండు పంటలకు సాగునీటి అంది రైతుల కష్టాలు తీరుతాయని నిర్ధారణకు వచ్చి నిదులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరగా పనులు కొనసాగాలని ఆదేశించారు. ఇచ్చిన మాట నెరవేర్చాలని రోడ్ కం బ్యారేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu