Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చరిత్ర ఆనవాళ్లకు ప్రసిద్ధి మెదక్ : కలెక్టర్ ప్రతిమా సింగ్

చరిత్ర ఆనవాళ్లకు ప్రసిద్ధి మెదక్ : కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, 20 మే (హి.స.)

భావితరాలకు మెదక్ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల ఉనికి అందించేలా డాక్యుమెంటరీ తయారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

బుధవారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 'పర్యాటక వారోత్సవాల' సందర్భంగా హెరిటేజ్ వాక్ లో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఎ అంబదాస్ రాజేశ్వర్,మెదక్ ఆర్డీవో రమాదేవి, మత్స్యశాఖ అధికారి మల్లేశం యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డిపిఓ యాదయ్య, ఇరిగేషన్ ఈ .ఈ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు.

ముందుగా వెస్లీ పాఠశాలను, మెదక్ చర్చిని, గుల్సన్ క్లబ్ అనంతరం మెదక్ పోర్ట్ సందర్శించి హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా సుసంపన్నమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. మెదక్ జిల్లా ప్రాధాన్యతను భావితరాలకు అందించేలా జిల్లాలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను డాక్యుమెంటరీ తయారీ చేస్తున్నట్లు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu