Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

చిన్నారుల్లో.వైకల్యాన్ని నిర్ధారించేందుకు. కృత్రి మేధ వినియోగం

అమరావతి, 03 జూన్ (హి.స.)

పాడేరు, చిన్నారుల్లో వైకల్యాన్ని నిర్ధారించేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించనున్నట్లు కలెక్టర్ నిశాంతి చెప్పారు. చిన్న వయసులోనే పిల్లలో లోపాలను గుర్తించి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఐ దోహదపడుతుందన్నారు.

పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు, వైకల్యాలను ముందస్తుగా గుర్తించేందుకు ఏఐ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నవచేతన' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పిల్లల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం, అభ్యసన సామర్థ్యాల పెంపునకు నవ చేతన దోహదపడుతుందని చెప్పారు. ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్ పడాల్ మాట్లాడుతూ.. సూపర్వైజర్లు, సీడీపీఓలు, వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు ఈ నెల 5 నుంచి 9 వరకు శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏడీఎంహెచ్వో ప్రతాప్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ టీఎస్ఎన్ రాజు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శివకుమార్, హెచ్ఓడీ డాక్టర్ చంద్రమోహన్, సీడీపీఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu