Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

దేశంలోనే ప్రైవేటు రంగంలో.మెరైన్ గ్యాస్ టర్బైన్ సెంటర్

విశాఖపట్నం,: 21 మే (హి.స.)

దేశంలోనే ప్రైవేటు రంగంలో తొలి మెరైన్ గ్యాస్ టర్బైన్(ఎంజీటీ) రిపేర్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో భారత్ ఫోర్జ్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక్కడి నేవల్ డాక్యార్డులోని 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ను నిర్మిస్తారు. అందులో మెరైన్ గ్యాస్ టర్బైన్లకు మరమ్మతులతోపాటు ఓవర్హాలింగ్ కూడా చేస్తారు. దాంతో పాటు ఎంజీటీలను దేశీయంగా అభివృద్ధి చేసే వసతులు సమకూరుస్తారు. రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఇది దోహదపడనుంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల్లో ఎంజీటీలు చాలా కీలకపాత్ర పోషిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu