Dailyhunt
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆందోళన..

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆందోళన..

యాదాద్రి భువనగిరి, 04 మే (హి.స.)

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు రైతులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో చిట్యాల - భునగిరి రహదారిపై ధర్నాకు దిగారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రహదారిపై వడ్లు పోసి నిరసన వ్యక్తం చేశారు. -

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తే ప్రభుత్వ అసమర్ధతో పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు వర్షాలకు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మద్దతు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu