Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకత.. మంత్రి వివేక్

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకత.. మంత్రి వివేక్

మిర్యాలగూడ, 17 మే (హి.స.)

రైతులకు ఎలాంటి ఇబ్బందులు

కలగకుండా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పారదర్శకతను పాటిస్తుందని, పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా జూన్ రెండు నుంచి కొత్త పెన్షన్లను అందించనున్నట్లు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడంతో పాటు లబ్ధిదారులకు సకాలంలో పేమెంట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని, జూన్ 2 నుంచి రెండు లక్షల కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే టామ్ కామ్ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీ పై నైపుణ్యం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 90 కోట్లు రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించినట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా జర్మనీ భాషలో కూడా నైపుణ్యం సాధించేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలలో కార్మికుల రక్షణ కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఫార్మా రంగంలో ప్రమాదాల నివారణకు నూతన విధివిధానాలను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu