Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధర్మవరంలో లోకేష్ పర్యటన.. పసుపు మయమైన ప్రధాన రహదారులు

ధర్మవరంలో లోకేష్ పర్యటన.. పసుపు మయమైన ప్రధాన రహదారులు

ధర్మవరం, 14 మే (హి.స.)

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ రోజు బత్తలపల్లి లోని ఆర్డిటి ప్రజా వైద్యశాల సందర్శన కోసం వస్తున్నారు.

లోకేష్ పర్యటన నేపథ్యంలో ధర్మవరం టీడీపీ ఇన్చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ మొత్తం ఏర్పాట్లన్నీ తన భుజస్కందాలపై వేసుకొని కార్యక్రమం విజయవంతం చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు కార్యకర్తలతో రెండురోజులుగా సమీక్షలు చేసి నారా లోకేష్ పర్యటన విజయవంతం చేయాలని సూచించారు. పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ధర్మవరం బత్తలపల్లి లో ప్రధాన రహదారులన్నీ లోకేష్ బ్యానర్లు జండాలతో నిండిపోయాయి. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం వివిధ కారణాలతో నిస్తేజంగా ఉన్న టీడీపీ క్యాడర్ నారా లోకేష్ పర్యటనతో ఉత్తేజితం అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu