Dailyhunt
డిజిటల్ చెల్లింపుల కొత్త రికార్డు.. ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి యూపీఐ లావాదేవీలు

డిజిటల్ చెల్లింపుల కొత్త రికార్డు.. ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి యూపీఐ లావాదేవీలు

హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)

దేశంలో డిజిటల్ చెల్లింపులు కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. తాజాగా మార్చి నెలకు సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు ఏకంగా 10 శాతం పెరిగాయి.

ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం, మార్చి నెలలో మొత్తం యూపీఐ లావాదేవీలు రూ. 29.52 లక్షల కోట్లకు చేరగా, ఇది ఫిబ్రవరిలో జరిగిన రూ. 26.84 లక్షల కోట్ల కంటే 10 శాతం ఎక్కువ. ముఖ్యంగా డిమాండ్ పెరుగుదలతో పాటు అంతకుముందు ఫిబ్రవరిలో తక్కువ రోజుల కారణంగా వృద్ధి అత్యధికంగా నమోదైంది2016, ఏప్రిల్లో యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నమోదైన అత్యధిక లావాదేవీల సంఖ్య, విలువ ఇవే కావడం విశేషం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu