Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి, 02 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు, నాయకులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తన ట్వీట్లో.. అభిమానుల గుండెల్లో 'పవర్ స్టార్ గా చిరస్థాయిగా నిలిచిన పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటూ, రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిజం చేసే దిశగా ఆయన అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని కొనియాడారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామసీమల్లో పెనుమార్పులు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల కష్టాలను తీర్చేలా రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు, పచ్చదనం పెంపునకు ఆయన తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు క్షేత్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో పని చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu