Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దివాలా రాష్ట్రమని ప్రచారం చేసే వారికి ప్రపంచబ్యాంకు నివేదికే సమాధానం: కేటీఆర్

దివాలా రాష్ట్రమని ప్రచారం చేసే వారికి ప్రపంచబ్యాంకు నివేదికే సమాధానం: కేటీఆర్

హైదరాబాద్, 08 జూలై (హి.స.)తెలంగాణ ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రమంటూ ప్రపంచబ్యాంకు నివేదికను వెల్లడించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణ విఫల రాష్ట్రం కాలేదని.. సఫల సంపన్న రాష్ట్రమై సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు.

కేటీఆర్ పోస్ట్..

'తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది! సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించింది! తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కం బెంచ్ మార్క్ను దాటి ఎదిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది! దేశంలో ఈ హోదాను సాధించిన ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం మనకు గర్వకారణం! పదేండ్ల పాలనలో ఏం జరిగింది? దరిద్రం తాండవించిన ప్రాంతం.. ధనిక రాష్ట్రంగా అవతరించింది! బికారులు కాదు నా తెలంగాణ ప్రజలు.. సిరిసంపదలతో తులతూగే తెలంగాణ తల్లి బిడ్డలు! విఫల రాష్ట్రం కాలేదు తెలంగాణ.. సఫల సంపన్న రాష్ట్రమై సగర్వంగా నిలిచింది! తమ చెమటను.. నైపుణ్యాన్ని.. మేధస్సును రంగరించి తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికీ శుభాభివందనాలు! తెలంగాణ వస్తే ఏమొచ్చింది? జాతి సంపద పెరిగింది.. జనం ఆదాయం అద్భుతంగా పెరిగింది! కేసీఆర్ దార్శనిక పాలనలో ఆర్థిక వ్యవస్థ అద్వితీయంగా అభివృద్ధి చెందిందని జాతీయ నివేదికలే కాదు.. అంతర్జాతీయ సంస్థలు తేల్చిచెబుతున్నాయి..! దివాలా రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారాలు చేసేవాళ్లకు ప్రపంచ బ్యాంకు తాజా నివేదికే సమాధానం..!' అని ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu