Dailyhunt

ఈనెల 9న వనపర్తి వెళ్లనున్న హరీష్ రావు

వనపర్తి, 05 ఏప్రిల్ (హి.స.)

నెల 9వ తేదీన మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు మా ట్లాడుతూ గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన వ్యర్థమని, ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికే కాంగ్రెస్ నాయకుల ప్రయత్నమని అన్నారు.

గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదన వ్యతిరేక పోరాట సమితి నా యకులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలపడానికి ఈనెల 9వ తేదీన మాజీ మంత్రి హరీశ్రావు పర్యటన ఉంటుందని దానిని విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకమని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి ప్రజలకు అండగా నిలవాలన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన ముందుకు తెచ్చారని దీనిని వ్యతిరేకిస్తూ రైతులు 97రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu