Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం సమృద్ధిగా ఎరువులు

ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం సమృద్ధిగా ఎరువులు

కర్నూలు, 19 మే (హి.స.)

ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం సమృద్ధిగా ఎరువులున్నాయి. ముఖ్యంగా యూరియా, డీఏపీ, పొటాష్ తదితర ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈసారి ఖరీ్ఫలో యూరియా 58,872 మెట్రిక్ టన్నులను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డీఏపీ వచ్చే ఖరీ్ఫలో 15,408 మెట్రిక్ టన్నులను రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంప్లెక్స్ ఎరువులు ఈసారి ఖరీ్ఫలో 1,28,013 మెట్రిక్ టన్నులు అందించాలని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఖరీ్ఫలో 2,70,000 మెట్రిక్ టన్నులు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. యూరియా వాడకాన్ని తగ్గించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోనున్నారు. రైతులకు ఎక్కువ మొత్తంలో యూరియాను అందించకుండా పంటకు అవసరమయ్యే యూరియాను మాత్రమే రైతుకు అందించేలా చర్యలు చేపట్టను న్నారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ, బయో ఫర్టిలైజర్లు, సేంద్రియ ఎరువులను రైతులకు అలవాటు చేసేందుకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. సేంద్రియ ఎరువులతో పాటు ఎఫ్వైఎం, వర్మి కంపోస్టు, గ్రీన్ మ్యాన్యుర్ పంటలు, బయో ఫర్టిలైజర్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu