
న్యూఢిల్లీ, 05 మే (హి.స.)
కేంద్ర ఎన్నికల సంఘం (Central
Election Commission) సంచలన కీలక నిర్ణయం తీసుకున్నది. పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా (Falta) అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ను రద్దు చేస్తూ మే 21న మొత్తం 285 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మే 24న ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. అయితే, ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సందర్భంగా ఫాల్తాలో పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నేరాలు జరిగాయని ఈసీ పేర్కొంది. రిగ్గింగ్, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడం వంటి తీవ్రమైన ఆరోపణలను పరిశీలించిన అనంతరం, నిష్పాక్షికమైన ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

