Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎన్యూమరేషన్.డిజిటల్యూసేషన్.ఫారాల ప్రక్రియ. ఈ నెల 13 లోగా పూర్తి చేయాలి

విజయనగరం రూరల్, 04 జూలై (హి.స.)

:

విజయనగరం నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఈ నెల 13వ తేదీలోగా పూర్తి చేయాలని జేసీ ఎస్.సేధుమాధవన్ అధికారులను ఆదేశించారు.

శనివానం తన ఛాంబర్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. డేటా ఎంట్రీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిజిటలైజేషన్ పనుల నాణ్యత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ నెల 13లోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విజయనగరం ఈఆర్వో, ఆర్డీవో సుధాసాగర్, తహసీల్దార్, ఏఈఆర్వో కూర్మనాథరావుతోపాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu