Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఏపీ ఐ సెట్ 2026 ఫలితాలు విడుదల

అమరావతి, 16 మే (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్https://cets.apsche.ap.gov.in/ICETలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu