Dailyhunt

ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్దులకు మధ్యన భోజనం పథకం కింద రాగి జావా పంపిణీ

అమరావతి, 04 మే (హి.స.)

పీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్తో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. 2026-29 కాలానికి ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది.

మెనూలో మార్పులు చేసి ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన, శుచిగా భోజనం అందించేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక పర్యవేక్షణ వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్తో కాలపరిమితి ముగిసింది. విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే ఉద్దేశంతో మరో మూడేళ్లు కొనసాగించాలని విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu