Dailyhunt

ఏపీ తీరప్రాంతాల్లో అక్రమంగా చేపల వేట

నెల్లూరు, 05 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడు బోట్లను ఎదుర్కొనేందుకు టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దింపినట్లు మంత్రి వెల్లడించారు. మన రాష్ట్ర మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు కొల్లగొడుతున్నారని.. అందుకే ఆధునిక స్పీడ్ బోట్ల సహాయంతో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu