Dailyhunt
ఏపీలో 482 మంది డాక్టర్లకు కొలువులు.. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశం

ఏపీలో 482 మంది డాక్టర్లకు కొలువులు.. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశం

అమరావతి, 02 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 482 మంది వైద్యులకు రెగ్యులర్ ప్రాతిపదికన నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఉత్తర్వులు అందుకున్న వారు 15 రోజుల్లోగా తమకు కేటాయించిన విధుల్లో చేరాలని ఆయన సూచించారు.

గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఈ నియామకాలు జరిగాయి. ఈ పోస్టుల కోసం దాదాపు 5,000 మంది ఎంబీబీఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి తుది జాబితాను సిద్ధం చేశారు. ఆన్లైన్ కౌన్సెలింగ్లో 611 పోస్టులకు గాను 482 మంది అభ్యర్థులు తమ ఐచ్ఛికాలను (వెబ్ ఆప్షన్లు) ఎంచుకున్నారు. వారికి తక్షణమే నియామక ఉత్తర్వులను జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu