Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎరువుల అమ్మకాల్లో అక్రమాలు అరికట్టడానికి.డిజిటల్.విధానం

అమరావతి, 21 మే (హి.స.)

రువుల అమ్మకాల్లో అక్రమాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం డిజిటల్ విధానం అమల్లోకి తెస్తోంది. అక్రమ తరలింపు, వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అవసరానికి మించి కొనుగోళ్లను నియంత్రించే లక్ష్యంతో యాప్ను రూపొందించింది.

కౌలురైతులతో సహా అసలైన సాగుదారులకు రాయితీ ఎరువులను అందించడానికి, ఎరువుల వినియోగాన్ని సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి ఈ డిజిటల్ వ్యవస్థను వ్యవసాయశాఖ తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(ఏపీఎయిమ్స్) 2.0 ద్వారా ఎరువుల పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీంతో రైతులు తమకు కావాల్సిన ఎరువుల్ని ముందుగానే యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రైతుకు సీజన్లో గరిష్ఠంగా 50 బస్తాల ఎరువులు అందేలా ఈ ఏపీఎయిమ్స్ యాప్ను రూపొందించారు. జాతీయ స్థాయిలో ఐఎ్ఫఎంఎస్ పోర్టల్తో అనుసంధానం చేస్తూ, ఈ యాప్ను రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్లో ఎరువులు బుక్ చేసుకుంటే.. ఎమ్మార్పీ ప్రకారం సొమ్మును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ షాపులో చెల్లించవచ్చు. పంట దశను బట్టి యాప్ ద్వారా టోకెన్ జారీ అవుతుంది. టోకెన్ ఉంటేనే ఎరువును తీసుకునే అవకాశం ఉంటుంది. రైతులు కావాల్సిన ఎరువులను సమీప డీలర్ వద్ద డెలివరీ తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. దీని వల్ల యూరియా, డీఏపీ వంటి ఎరువుల డిమాండ్పై వ్యవసాయశాఖకు కచ్చితమైన సమాచారం అందుతుంది.

రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు జూలై నెల వరకు సరిపడా నిల్వలున్నట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తాజాగా నివేదించింది. ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రానికి వివిధ రకాల రసాయన ఎరువులు 18.09 లక్షల టన్నులు కేంద్రం కేటాయించింది. ఈనెల 17 నాటికి మే నెల ప్రణాళిక, సరఫరా, అమ్మకాలను పరిశీలిస్తే.. అన్ని రకాల ఎరువులు గత మూడేళ్ల సగటు అమ్మకాలు 78,491 టన్నులుగా రికార్డయింది. ఏప్రిల్, మే నెలల్లో వ్యవసాయ పంటలు లేకపోయినా.. కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలకు రైతులు కొనుగోలు చేస్తున్నారని డీలర్లు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.63 లక్షల టన్నుల యూరియా, 95 వేల టన్నుల డీఏపీ నిల్వలున్నాయి. ఇవన్నీ జూలై నెల వరకు సరిపోతాయని అధికారులు చెప్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu