Dailyhunt
గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు

గిరిజనులకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా: ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు.

గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బావోజీ జాతరకు మాజీ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'లోక్ మసంద్ మహారాజ్ జాతరకు రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతానికి రూ.8 కోట్లతో బ్రిడ్జి వేయించింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అని, దేవాలయ అభివృద్ధికి, గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ ఎంతో చేశారు అన్నారు . గిరిజనులకు ఇప్పుడు కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్ ఇచ్చి వారు చేసిందేమీ లేదు అని ఏద్దేవా చేసారు .

గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహాకాలు ఇస్తామన్నారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యకు దూరం చేస్తున్నారు అని విమర్శించారు .

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్యాకేజ్-3లో కొంత పని మాత్రమే మిగిలి ఉంది అన్నారు . . పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ . మీ నిర్లక్ష్యం వల్ల పాలమూరు ప్రజలకు అన్యాయం జరిగింది' అని కాంగ్రెస్ ను విమర్శించారు .

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu