Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్

హైదరాబాద్, 08 జూలై (హి.స.)టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

11కేవీ ఆనంద్ ఫీడర్ పరిధిలోని డౌన్ స్కూల్, బీబీ క్యాన్సర్ ఆస్పత్రి, జియా కా హోటల్, ఇబ్రహీం పంక్షన్ హాల్, బాబుమియా గిర్ని పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆర్య సమాజ్ ఫీడర్ పరిధిలోని దిల్కుషా పంక్షన్ హాల్, మలక్పేట పైర్స్టేషన్, ఆఫీసర్స్ మెస్, అమీర్ ఫాతిమా మసీదు, రామాలయం, అక్బర్బాగ్ ఎక్స్ రోడ్డు, దయానంద్ నగర్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని డీఈ తెలిపారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు..

పంజాగుట్ట: గ్రీన్ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జయశంకర్ నగర్, మెజెస్టిక్ మాన్షన్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోరబండ ఎస్ఆర్టీనగర్, ఎస్పీఆర్ హిల్స్ సంజయ్ నగర్, బేగంపేట నాలా, చీకోటి గార్డెన్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాం తాల్లోనూ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu