Dailyhunt
హైకోర్టు అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం లాంటిది: సీఎం రేవంత్ రెడ్డి

హైకోర్టు అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం లాంటిది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.) హైకోర్టు కాంప్లెక్స్ అనేది అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం లాంటిదని అలాంటి హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం రావడం తనకు సంతోషంతో పాటు గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రాజకీయ నాయకుల జీవితాల్లో ఇలాంటి సందర్భంగా అరుదుగా వస్తుందని, ఈ అవకాశం తనకు దక్కిందన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుత అవసరాలకు హైకోర్టు సరిపోవడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనానికి హెరిటేజ్ గుర్తింపు ఉంది. చరిత్రను కాపాడుకుంటూ కొత్త భవన సముదాయం నిర్మిస్తున్నామన్నారు. రాబోయే వందేళ్ల వరకు ప్రజలు వచ్చేలా హైకోర్టు నిర్మాణం ఉండబోతోందన్నారు. న్యాయశాఖకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ డిసిషన్ హైకోర్టు నిర్మాణంపైనే తీసుకున్నామని వచ్చే ఏడాది డిసెంబర్ లోపు హైకోర్టు జోన్ -2 నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu