Dailyhunt
హిందూ సమాజానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి.. ఎమ్మెల్సీ కొమురయ్య

హిందూ సమాజానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి.. ఎమ్మెల్సీ కొమురయ్య

మహబూబ్నగర్, 06 మే (హి.స.)

జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలురాలతాయా అన్న కొండా వ్యాఖ్యలపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

బుధవారం మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై జడ్చర్లలో స్పందించిన ఎమ్మెల్సీ కొమురయ్య మంత్రి కొండా సురేఖ బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మీ స్వార్థ రాజకీయాల కోసం హిందూ సమాజం మనోభావాలు దెబ్బ తీయాలనీ చూస్తే ఊరుకోబోమని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకీ మోదీ టూర్ భయం పట్టుకుందిని ఆ భయంతోనే వాళ్ళు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మోదీ అమితాషా ఒక్కసారి కాన్సంట్రేషన్ చేస్తే ఎక్కడైనా మేమే గెలుస్తాం అన్నారు.

మొన్న ఢిల్లీలో నిరూపించారని.. నిన్న వెస్ట్ బెంగాల్ లో మరోసారి రుజువైంది అని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మోదీ తెలంగాణకు వస్తున్నాడు అంటే ఎందుకు అంత భయపడుతున్నారు అన్నారు. ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే తిరస్కరించారని కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయరు, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వరు అని, ఇవన్నీ ప్రశ్నిస్తామన్నా భయం కాంగ్రెస్ కు పట్టుకుందని తెలిపారు. అందుకే. ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో అర్థమైపోయిందని, తెలంగాణ కాంగ్రెస్ లో మోదీ టూర్ భయం పట్టుకుందని ఇదే తెలంగాణలో బిజెపి గెలవబోతుందన్నదానికి సంకేతం అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu