Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ సప్లీ పరీక్షలు.. 22 కేంద్రాలు 9502 మంది విద్యార్థులు

ఇంటర్ సప్లీ పరీక్షలు.. 22 కేంద్రాలు 9502 మంది విద్యార్థులు

మార్కాపురం, 18 మే (హి.స.)

ఈనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జిల్లా లో జరగనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.

విజయ సునీత అధికారులను ఆదేశించారు.

స్థానిక కలెక్టరేట్లో ఈ రోజు ఉదయం విద్యాశాఖ తోపాటు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, విద్యుత్ నీటి సౌకర్యం, అలాగే విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను లేకుండా చూడాలన్నారు.

మార్కాపురం జిల్లాలో మొత్తం 22 కేంద్రాల్లో 9502 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయబోతున్నారని పరీక్షల నిర్వహణ అధికారులు తెలిపారు. అదేవిధంగా సమస్యల కోసం 08592281275 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఆయా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఐవో కె. ఆంజనేయులు, సభ్యులు రమణారెడ్డి, ఇన్చార్జి డిఎంహెచ్ వో రాహుల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu