Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జై భీమ్ భారత్ పార్టీ. వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ తో పాటుగా మరికొందరిపై కేసులు నమోదు

జై భీమ్ భారత్ పార్టీ. వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ తో పాటుగా మరికొందరిపై కేసులు నమోదు

Hindusthan Samachar 4 months ago

ఏలూరు , 02 జూలై (హి.స.)

మత విద్వేషాలు, వైషమ్యాలు రగిలిస్తూ, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అందిన ఫిర్యాదు మేరకు జై భీమ్ భారత్పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్తోపాటు మరికొందరిపై ఏలూరు త్రీ టౌన్, కాళ్ల పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

గత నెల 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం బహిరంగ సభలో శ్రవణ్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ తో పాటు మరికొందరు తమ ప్రసంగాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను వ్యక్తిగతంగా దూషించి హేళన చేశారని ఏలూరు గొల్లాయిగూడానికి చెందిన పెద్దాడ వెంకటరమణ, కాళ్ల మండలం సీసలికి చెందిన తోట ఫణిబాబు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, పాలకోడేరు పోలీసు స్టేషన్లలోనూ శ్రవణ్ కుమార్పై ఫిర్యాదులందాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu