Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి.. మెదక్ జిల్లా కలెక్టర్

జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి.. మెదక్ జిల్లా కలెక్టర్

మెదక్, 16 మే (హి.స.)

జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని, జనగణనకు ప్రజలు సహకరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు.

శనివారం రామాయంపేట మండలం అక్కన్నపేట లో జనగణన 2027 లో భాగంగా సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన లో జనగణన కీలకమని, జనాభా గణన, గృహ జాబితా ఆమె పరిశీలించారు. ఇళ్ల లెక్కింపు ప్రక్రియను ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ రజని లతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ప్రజల ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. సేకరించిన వివరాలు అన్ని గోప్యంగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. అనుభవజ్ఞులైన ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించడం జరిగిందన్నారు. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు జనగణను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని నిరంతరం మండల స్థాయి అధికారులు కొనుగోలు కేంద్రాల పై నిఘా పెట్టాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu