Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనగణనలో కులగణన మినహాయించాలని పిల్- కొట్టివేసిన సుప్రీంకోర్టు

జనగణనలో కులగణన మినహాయించాలని పిల్- కొట్టివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, 20 మే (హి.స.)

జనగణనలో కులగణన మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన అంశమని అందువల్ల జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది.

జనగణన కులప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సంక్షేమ పథకాల కోసం వెనుకబడిన కులాల జనాభా ఎంతో కేంద్రప్రభుత్వం తెలుసుకోవాలని ఆదేశించారు. జనగణన సందర్భంగా ఏజెన్సీలు కులగణనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సీజేఐతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu