పుట్టపర్తి, 15 మే (హి.స.)
: దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారుకాబోతందని ముఖ్యమంత్రి చంద్రబాబు) అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
''పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా గుర్తొస్తారు. తన బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారు. ఆపరేషన్ సిందూర్ భారతీయులకు గర్వకారణం. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకో సిస్టమ్కు శ్రీకారం చుట్టాం. రూ.686 కోట్లతో 8 సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. ఒకానోక దశలో అనంతపురం ఎడారిగా మారిపోయింది. రాయలసీమ రూపు రేఖలు పూర్తిగా మార్చిన ఘనత ఎన్టీఆర్ది. సీమకు నీళ్లు తీసుకురావాలి, ప్రజల జీవితాలను మార్చాలని ఎన్టీఆర్ సంకల్పించారు. ఆయన శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. సమర్థ నీటి నిర్వహణతో సీమకు జలహారతి ఇచ్చాం. కేంద్రం సహకారంతో రాయలసీమ రూపు రేఖలు మారబోతున్నాయి. రాయలసీమను మళ్లీ రతనాలసీమ చేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. కడప స్టీల్ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభించి 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసి రాయలసీమకు కానుకగా ఇస్తాం. దేశానికి ఏపీ రక్షణకవచంగా నిలబడుతోంది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తాం. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారబోతోంది'' అని సీఎం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
