
న్యూఢిల్లీ, 15 మే (హి.స.)
నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసిన అధికారులు, తిరిగి ఆ పరీక్షను జూన్ 21 న నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు.
మే 3న జరిగిన పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు, అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులకు జూన్ 14న అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు వాటిని అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీ-ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పనిలేదని అధికారులు వెల్లడించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద అత్యున్నత స్థాయి భద్రతా చర్యలు చేపట్టనున్నారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, డిజిటల్ నిఘా, పేపర్ రవాణాలో అధునాతన సాంకేతికతను వాడాలని ఎన్టీఏ (NTA) నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

