Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు.. గోదావరిలో పుష్కర స్నానమాచరించిన మంత్రి

కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు.. గోదావరిలో పుష్కర స్నానమాచరించిన మంత్రి

భూపాలపల్లి, 21 మే (హి.స.)

సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

గోదావరి నదిలో పుష్కర స్నానం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆయన 12 రోజుల పాటు 12 పీఠాధిపతులు సరస్వతి పుష్కర స్నానాలు ఆచరిస్తారని 12 రోజుల పాటు కాళేశ్వరంలో ప్రత్యేక హోమాలు నిర్వహించి ప్రజలంతా సుఖసంతోషాలు ఉండే విధంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రతిరోజు సాయంత్రం గోదావరి నదికి ప్రత్యేకంగా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా కాశీ బ్రాహ్మణోత్తంలచే హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పుష్కరాలకు రాష్ట్రంలోని మంత్రులు ,ఎంపీలు,శాసనసభ్యులు చాలామంది హాజరవుతారని భక్తులు అందరూ పుష్కర కార్యక్రమాలకు సహకరించవలసిందిగా ఆయన కోరారు. ఆది పుష్కరాలు జరిగిన పొరపాట్లు జరగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది అన్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu