Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి పోస్టు

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి పోస్టు

హైదరాబాద్, 02 సెప్టెంబర్ (హి.స.)

ప్రజా ఆకాంక్షలు, అమరుల త్యాగాల ఆశయాలే ఇంధనంగా కాంగ్రెస్వె ప్రభుత్వం వేయి రోజుల ప్రజా ప్రస్థానం కొనసాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు భావోద్వేగపూరిత సందేశాన్ని పంపించారు.

రాష్ట్ర సుదీర్ఘకాలిక భవిష్యత్తును, యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని, సకల వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ పాలన అందిస్తున్నామని సీఎం వివరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అండతో తెలంగాణను విశ్వ వేదికపై విజయపతాకగా నిలిపే వరకు ఈ కృషిని అవిశ్రాంతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమాచార.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu