Dailyhunt
కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగ్

కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్, 05 మే (హి.స.)

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఓటమిపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు సభ్యులు మురిసిపోతుండడంపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసోం, బంగాల్లలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు బీజేపీ వేసిన ఒక పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. ప్రజలు చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి, దేశం కోసం బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.

బంగాల్లో బీజేపీ 100 కంటే ఎక్కువ సీట్లను లూటీ చేసిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్గా మారిపోయిందని ఆరోపించారు. బంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని అనైతికతం, చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ పూర్తిగా ఏకీభవించారు. ఎన్నికల కమిషన్ మద్దతులో బీజేపీ అసోం, బంగాల్ ఎన్నికలను చోరీ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మేము మమతా బెనర్జీతో ఏకీభవిస్తున్నాం. బంగాల్లో 100 కంటే ఎక్కువ సీట్లు చోరీ అయ్యాయి అని రాహుల్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu